అనపర్తి, సెప్టెంబరు 24 (పున్నమి ప్రతినిధి): నియోజకవర్గంలో పరిశ్రమలు సీఎస్ఆర్ నిధులను ప్రజా ప్రయోజనాలకు ఖర్చు చేయాల్సిందేనని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. గ్రాసిమ్, ఐటీసీ సంస్థలు చేపడుతున్న సీఎస్ఆర్ కార్యక్రమాలపై వివరాలు స్పష్టంగా ఉండాలని కోరారు. ప్రతి గ్రామంలో నిర్మించిన కమ్యూనిటీ హాళ్ల వ్యయాన్ని అధికారులు పరిశీలించాలని సూచించారు. ఐటీసీ అందించిన విద్యా కిట్లకు, ఇతర కార్యక్రమాలకు నియోజకవర్గంలో ఎంత ఖర్చు చేస్తున్నారో వెల్లడించాలన్నారు. పరిశ్రమలకు సంబంధించిన హౌస్ ట్యాక్స్‌లను ఎంపీడీవో అధికారులు పరిశీలించి, పక్కాగా వసూలు చేయాలని సూచించారు. సీఎస్ఆర్ నిధులతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

సీఎస్ఆర్ నిధులు ఖర్చు చేయాల్సిందే: ఎమ్మెల్యే నల్లమిల్లి