Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కాకినాడ

సీఎంను కలిసిన పిల్లి దంపతులు నియోజకవర్గ సమస్యలపై వినతి.. వైద్యసాయం, సీఎంఆర్‌ఎఫ్‌ నిధులకు సానుకూల స్పందన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సీఎంను కలిసిన పిల్లి దంపతులు నియోజకవర్గ సమస్యలపై వినతి.. వైద్యసాయం, సీఎంఆర్‌ఎఫ్‌ నిధులకు సానుకూల స్పందన

వార్త ముఖ్యాంశాలు

  • కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 6(పున్నమి న్యూస్): నియోజకవర్గానికి చెందిన పలు సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు కాకినాడ రూరల్‌ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు తెలిపారు.
  • విజయవాడలోని సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని వారు కలిసి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు, ప్రజలకు అవసరమైన సాయం, అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలను వివరించారు.
  • ఈ సందర్భంగా నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు, ప్రజలకు సంబంధించిన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) దరఖాస్తులను ముఖ్యమంత్రికి అందజేశారు.

కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 6(పున్నమి న్యూస్):
నియోజకవర్గానికి చెందిన పలు సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు కాకినాడ రూరల్‌ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు తెలిపారు. విజయవాడలోని సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని వారు కలిసి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు, ప్రజలకు అవసరమైన సాయం, అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలను వివరించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు, ప్రజలకు సంబంధించిన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) దరఖాస్తులను ముఖ్యమంత్రికి అందజేశారు. వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న పలువురికి సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్థికసాయం అందించాలని కోరారు.
*వైద్యానికి మరో రూ.5 లక్షలు మంజూరు*
కరప మండలం వేళంగి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ఇప్పటికే ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరైనప్పటికీ సదరు వ్యక్తి కుటుంబ పరిస్థితి దయనీయంగా ఉందని చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఇప్పటికే సుమారు రూ.60 లక్షల వరకు ఖర్చు చేశారని వివరించారు.మానవతా దృక్పథంతో మరింత ఆర్థికసాయం అందించాలని పిల్లి దంపతులు కోరగా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించి మరో రూ.5 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.
*పాముకాటుతో మృతి చెందిన కుటుంబానికి రూ.2 లక్షలు*
నియోజకవర్గంలో పాముకాటుకు గురై మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబ పరిస్థితిని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని కోరగా, సీఎం చంద్రబాబునాయుడు రూ.2 లక్షల ఆర్థికసాయం మంజూరు చేసినట్లు పిల్లి దంపతులు తెలిపారు.
*తిరస్కరణకు గురైన సీఎంఆర్‌ఎఫ్‌ దరఖాస్తుకు ఊరట*
మరో కేసులో సీఎంఆర్‌ఎఫ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, అవసరమైన కొన్ని పత్రాలు లేకపోవడంతో దరఖాస్తు తిరస్కరణకు గురైందని తెలిపారు. గడువు దాటిన అనంతరం రిటర్న్‌ అయిన ఆ ఫైల్‌ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితిని వివరించడంతో సీఎం సానుకూలంగా స్పందించి అర్హత మేరకు 40 శాతం ఆర్థికసాయం మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
*ఆలయాల నిర్మాణానికి నిధులు*
కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని కరప, రూరల్‌ మండలాల్లో ఆలయాల నిర్మాణం, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు పిల్లి దంపతులు తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం సంబంధిత నిధులు మంజూరు చేసేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.
*బీసీ కమ్యూనిటీ హాళ్లకు నిధులు*
నియోజకవర్గంలోని బీసీ వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా బీసీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కూడా ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులకు నిధుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించినట్లు పిల్లి దంపతులు వెల్లడించారు.నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే సానుకూలంగా స్పందించి, పలు అంశాలపై ఆర్థికసాయం మంజూరు చేయడంతో పాటు అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం పట్ల పిల్లి అనంతలక్ష్మి, పిల్లి సత్యనారాయణమూర్తి దంపతులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *