వార్త ముఖ్యాంశాలు
- కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 6(పున్నమి న్యూస్): ఆంధ్ర రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి రైతులకు మేలు జరగాలని పంటలు బాగా పండాలని, రైతులకు, ప్రజలకు సాగు మరియు త్రాగు నీరుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుభిక్షంగా ఉండాలని వరుణ యాగం నిర్వహించడం జరిగిందిని కాకినాడ సిటీ శాసనసభ్యులు…
- ఆంధ్ర రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని కోరుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖు దేవాలయాల్లో నిర్వహించు వరుణ యాగం కార్యక్రమాన్ని మంగళవారం సూర్యారావుపేట శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం నందు నిర్వహించారు.
- ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ “ఎల్ నినో” పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, రైతులకు, ప్రజలకు సాగు మరియు త్రాగు నీరుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుభిక్షంగా ఉండాలని, వరుణ దేవుడు కరుణించి సకాలంలో వర్షాలు కురిపించాలని దేవదాయ శాఖ…
కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 6(పున్నమి న్యూస్):
ఆంధ్ర రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి రైతులకు మేలు జరగాలని పంటలు బాగా పండాలని, రైతులకు, ప్రజలకు సాగు మరియు త్రాగు నీరుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుభిక్షంగా ఉండాలని వరుణ యాగం నిర్వహించడం జరిగిందిని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు.
ఆంధ్ర రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని కోరుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖు దేవాలయాల్లో నిర్వహించు వరుణ యాగం కార్యక్రమాన్ని మంగళవారం సూర్యారావుపేట శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ “ఎల్ నినో” పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, రైతులకు, ప్రజలకు సాగు మరియు త్రాగు నీరుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుభిక్షంగా ఉండాలని, వరుణ దేవుడు కరుణించి సకాలంలో వర్షాలు కురిపించాలని దేవదాయ శాఖ ఆధ్వర్యంలో నేడు శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి సన్నిధిలో వరుణ యాగం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు, ఆలయ ఈ ఓ వీర్రాజు చౌదరి, చైర్మన్ గ్రంధి బాబ్జి, నెక్కంటి శ్రీనివాస్ చౌదరి,సీకోటి అప్పలకొండ,బోనేపల్లి శ్రీనివాస్, పసుపులేటి వెంకటేశ్వరరావు, సుందరపల్లి సత్తిబాబు,గోపిశెట్టి బూరయ్య, బంగారు సత్యనారాయణ,గంజి గోపి, తాళ్లూరి కనకరాజు,తదితరులు పాల్గొన్నారు.