వార్త ముఖ్యాంశాలు
- కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 6(పున్నమి న్యూస్): గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య మందిర్ - గ్రామీణ ఆరోగ్య కేంద్రాల ద్వారా ముంగిట్లోనే నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందనున్నాయని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు.
- గ్రామీణ పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరువ చేసే లక్ష్యం తో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ -గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను (విలేజ్ హెల్త్ క్లినిక్) రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నాడు కృష్ణా జిల్లా నుంచి గౌరవ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ…
- ఈ కార్యక్రమానికి వర్చువల్ విధానంలో కాకినాడ స్మార్ట్ సిటీ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, ప్రత్తిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ హాజరయ్యారు.ఈ సందర్భంగా కాకినాడ జిల్లాకు సంబంధించి నిర్మాణ పనులు పూర్తి…
కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 6(పున్నమి న్యూస్):
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య మందిర్ – గ్రామీణ ఆరోగ్య కేంద్రాల ద్వారా ముంగిట్లోనే నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందనున్నాయని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు.
గ్రామీణ పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరువ చేసే లక్ష్యం తో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ -గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను (విలేజ్ హెల్త్ క్లినిక్) రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నాడు కృష్ణా జిల్లా నుంచి గౌరవ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వర్చువల్ గా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి వర్చువల్ విధానంలో కాకినాడ స్మార్ట్ సిటీ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, ప్రత్తిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ హాజరయ్యారు.ఈ సందర్భంగా కాకినాడ జిల్లాకు సంబంధించి నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న పెద్దాపురం నియోజకవర్గంలో కట్టమూరు,పవర… ప్రత్తిపాడు నియోజక వర్గంలో పెద్దనాపల్లి, పోతులూరు గ్రామాల్లో నూతన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ – గ్రామీణ ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన శిలాఫలకాలను జిల్లా కలెక్టర్,ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ..* గ్రామీణ ప్రాంతాల ప్రజలు చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు కూడా జిల్లా కేంద్ర ఆసుపత్రులకు వచ్చి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని,వారి ముంగిట్లోనే ఉచిత వైద్యం అందజేసేలా ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేస్తున్నామన్నారు. స్థానికంగా ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,గ్రామ ఆరోగ్య క్లినిక్లను సంప్రదిస్తే అక్కడే అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా వైద్యం అందిస్తారని తెలిపారు. దీనివల్ల ప్రయాణ ఖర్చులు ఆదా అవ్వడంతో పాటు రోజంతా ఉపాధి కోల్పోయే నష్టం తప్పుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.వ్యాధి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే మేలనే ముఖ్య ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి చేతుల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా 259 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను వర్చువల్ గా ప్రారంభించారన్నారు.
జిల్లాలో మొత్తం 410 ఆరోగ్య క్లినిక్స్ ఉండగా, వాటిలో సుమారు 177 నూతన భవనాలను త్వరలోనే డిసెంబర్ నాటికి పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన ఈ ఆరోగ్య కేంద్రాలలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఏఎన్ఎం లు, ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉంటారని, దాదాపు 105 రకాల మందులు, 14 రకాల వైద్య పరీక్షలు అక్కడే ఉచితంగా లభిస్తాయని జిల్లా కలెక్టర్ వివరించారు.ఈ అద్భుతమైన సదుపాయాన్ని జిల్లాలోని ప్రతి పంచాయతీ ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకుని మెరుగైన వైద్య సేవలను పొందాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా *ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ..*
ఆరోగ్య రంగంలో గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విలేజ్ క్లినిక్స్ ఎంతగానో దోహదపడుతాయని పేర్కొన్నారు.రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల సంయుక్త సౌజన్యంతో ఏర్పాటవుతున్న ఈ క్లినిక్స్ ద్వారా పల్లె ప్రజలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలకూ నగరాల్లోని పెద్ద ఆసుపత్రులకు వెళ్లాల్సిన శ్రమ తప్పుతుందన్నారు.
ఈ గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణీ సేవలు, చిన్న పిల్లల వైద్యం, కుటుంబ నియంత్రణ, నాన్-కమ్యూనికేబుల్ వ్యాధుల నిర్ధారణతో పాటు సుమారు 14 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందుబాటు లో ఉంటాయని ఆమె వెల్లడించారు. టెలిమెడిసిన్ సేవలు,ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు,యోగా సెషన్లు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నందున, ప్రజలందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
ఈ సందర్భంగా *ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ మాట్లాడుతూ..* నూతనంగా మంజూరైన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు) నియోజకవర్గ ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా మారుతాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమానికి, మారుమూల ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి,సంక్షేమం సమాంతరంగా సాగుతున్నాయన్నారు.
జిల్లా వ్యాప్తంగా 177 ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు కాగా,అందులో ప్రత్తిపాడు నియోజకవర్గానికి అత్యధికంగా 29 కేంద్రాలు మంజూరు కాగా..ఇందులో రెండిటిని ప్రారంభించు కోవడం ఇక్కడి ప్రజల అదృష్టమని హర్షం వ్యక్తం చేశారు. ఒక్కో ఆరోగ్య కేంద్రానికి రూ.36 లక్షల చొప్పున వెచ్చించి, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అత్యుత్తమ మౌలిక వసతులతో వీటిని నిర్మించినట్లు ఆమె తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల ప్రజలు వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బందులు తప్పించేందుకే ఈ ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తీసుకు రావడం జరిగిందన్నారు. ఈ కేంద్రాలలో ప్రతిరోజూ పన్నెండు రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటాయని, ప్రజలు సీజనల్ వ్యాధులు, జ్వరాల పట్ల ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే గ్రామం, తద్వారా సమాజం ఆరోగ్యవంతంగా మారుతుందని ఆమె పేర్కొన్నారు.
సమావేశంలో ఇన్చార్జి డీఎంహెచ్వో డా.ఎస్. చలమయ్య, డీఐవో డా.కెవీ. సుబ్బరాజు, ఎన్.హెచ్.ఎం సీపీఎం డా.జి. లక్ష్మి, ప్రోగ్రాం అధికారులు డా.వి.అరుణ, డా.ఐ. ప్రభాకర్,డా.ఎన్. ప్రశాంతి, పంచాయతీరాజ్ ఎస్ఈ రామకృష్ణారెడ్డి ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.