Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కాకినాడ

జగ్గంపేటలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 11 రోజుల విజన్ సేవా కార్యక్రమాలు ప్రారంభం అన్నా క్యాంటీన్‌లో పేదలకఅన్నదానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
జగ్గంపేటలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 11 రోజుల విజన్ సేవా కార్యక్రమాలు ప్రారంభం అన్నా క్యాంటీన్‌లో పేదలకఅన్నదానం

కాకినాడ జిల్లా, జగ్గంపేట, అక్టోబర్ 8:
లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా 316-బి పిలుపు మేరకు ‘వీక్స్ ఆఫ్ సర్వీస్ – విజన్’ కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 11 రోజులపాటు నిర్వహించనున్న సేవా కార్యక్రమాలను గురువారం ఘనంగా ప్రారంభించారు. జగ్గంపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు కంటే ఉదయ భాస్కర్ చౌదరి ఆధ్వర్యంలో గోకవరం రోడ్డులోని కొడూరి రంగారావు–శ్రీమతి సుబ్బులక్ష్మి లయన్స్ జిల్లా కంటి ఆసుపత్రి, శ్రీమతి రాజేశ్వరి–రామకృష్ణ లయన్స్ కంటి వైద్యశాల ఆవరణలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ లయన్స్ గవర్నర్ చిట్టినీడి శ్రీనివాస్ ముందుగా లయన్స్ క్లబ్ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. అక్టోబర్ 8 నుంచి 18వ తేదీ వరకు మొత్తం 11 రోజులపాటు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట–గోకవరం రోడ్డులోని ఎన్టీఆర్ అన్న క్యాంటీన్‌లో లయన్ కోడూరి శ్రీనివాసరావు ఆర్థిక సహాయంతో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రాజేశ్వరి–రామకృష్ణ లయన్స్ కంటి వైద్యశాలలో పేదలు, పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ 11 రోజుల కార్యక్రమాల్లో అంధత్వ నివారణ, కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం, అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయడం, కేటరాక్ట్ ఆపరేషన్లకు అర్హులను ఎంపిక చేయడం వంటి పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు లయన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ప్రజలు ఈ సేవా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు మెట్ట రాధా, ఉమామహేశ్వరరావు, గ్రంధి వెంకటేశ్వరరావు, జిల్లా లయన్స్ హాస్పిటల్ ట్రస్ట్ సభ్యులు డాక్టర్ బాలగంగాధర్ రావు, జిల్లా లయన్స్ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులు కొత్త కొండబాబు, వల్లూరి గంగాధర్ రావు, వి. రామారావు, నక్క సత్యనారాయణ, కోడూరి శ్రీనివాస్, జగ్గంపేట లయన్స్ క్లబ్ సభ్యులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు లయన్స్ క్లబ్ ప్రతినిధులు, ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

జగ్గంపేటలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 11 రోజుల విజన్ సేవా కార్యక్రమాలు ప్రారంభం అన్నా క్యాంటీన్‌లో పేదలకఅన్నదానం

జగ్గంపేటలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 11 రోజుల విజన్ సేవా కార్యక్రమాలు ప్రారంభం అన్నా క్యాంటీన్‌లో పేదలకఅన్నదానం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *