శ్రీ కాళహస్తి, జూన్ 04, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా మంజూరైన ఆర్థిక సాయాన్ని గురువారం పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి చెక్కులను అందజేశారు. శ్రీకాళహస్తి పట్టణం, రూరల్ మండలాలకు చెందిన ఏడుగురు బాధితులకు మొత్తం రూ.4.56 లక్షల విలువైన సహాయక చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బృందమ్మ మాట్లాడుతూ, సీఎం సహాయనిధి ద్వారా అందుతున్న ఆర్థిక సాయం కష్టకాలంలో ఉన్న కుటుంబాలకు ఊరటనిస్తోందని, ప్రజలకు అవసరమైన సహాయం అందించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు జి. విజయకుమార్ నాయుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు, కాసారం రమేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ.. బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా