భైంసా: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ నాయకులు, శ్రీరాముడు–పరమశివుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం భైంసా పట్టణంలోని నిర్మల్ చౌరస్తాలో బీజేపీ, BJYM నాయకులు ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దేశ ప్రధాని, ప్రజల విశ్వాసాలకు సంబంధించిన అంశాలపై బాధ్యతాయుతంగా మాట్లాడాలని అన్నారు. శ్రీరాముడు, పరమశివుడు కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవాలని, వారి గురించి చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపించారు.
రాజకీయ విమర్శలకు మత విశ్వాసాలను ముడిపెట్టడం సరికాదని పేర్కొంటూ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని బీజేపీ, BJYM నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, BJYM నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



