విశాఖపట్నం జిల్లా,ఆనందపురo మండలం (పున్నమి ప్రతినిధి)ఆగస్టు 15:
గిడిజాల గ్రామంలో గల సావన్ మిత్రా స్కూల్ విద్యార్థులు యోగా విభాగంలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు పి. శ్రీచరణ్, ఎం. హర్ష, ఎల్. సాయి దనుష్ అమరావతి ఛాంపియన్షిప్ (యోగా)లో విశాఖపట్నం జిల్లాకు ప్రాతినిధ్యం వహించేందుకు ఎంపికై, రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు.
విద్యార్థుల కృషి, క్రమశిక్షణ, అంకితభావం పాఠశాలకు గర్వకారణంగా నిలిచాయని సావన్ మిత్రా స్కూల్ యాజమాన్యం పేర్కొంది. విద్యతో పాటు క్రీడలు, యోగా, సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి పాఠశాలలో ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపింది.
రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, విశాఖపట్నం జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు







