### సాయిబాబా కాలనీలో టోరో క్లబ్ జిమ్ ప్రారంభం
కూకట్పల్లి డివిజన్ సాయిబాబా కాలనీలో శుక్రవారం **TORO CLUB జిమ్**ను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిమ్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. యువత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వ్యాయామాన్ని నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించేందుకు ఇలాంటి జిమ్‌లు, క్రీడా వేదికలు మరింతగా అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు.


