మార్కెట్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయి. రైతులు నేరుగా వినియోగదారులకు ఉత్పత్తులు విక్రయించే అవకాశం కల్పించనున్నారు.
రసాయన రహిత పంటలకు మంచి ధరలు లభించడం ద్వారా రైతుల ఆదాయం పెరగడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందుబాటులోకి వస్తాయి. మార్కెటింగ్, బ్రాండింగ్, ప్యాకేజింగ్ అంశాల్లో కూడా రైతులకు శిక్షణ అందిస్తున్నారు.
సహజ వ్యవసాయ ఉత్పత్తుల ప్రోత్సాహం వల్ల పర్యావరణ పరిరక్షణ, భూసార సంరక్షణ, ఆరోగ్యకర ఆహారపు అలవాట్లకు కూడా ఊతం లభించనుంది. ఈ రంగం భవిష్యత్‌లో మరింత విస్తరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.


