Wednesday, 30 September 2026
  • Home  
  • సత్తుపల్లి–ఖమ్మం రూట్‌లో డీలక్స్ బస్సులకు ఎక్స్‌ప్రెస్ ఛార్జీ ప్రతి 8 నిమిషాలకు ఖమ్మంకు బస్సు.. 99 ట్రిప్పులు: సత్తుపల్లి డిపో మేనేజర్ లక్ష్మి నారాయణ వెల్లడి
- ఖమ్మం

సత్తుపల్లి–ఖమ్మం రూట్‌లో డీలక్స్ బస్సులకు ఎక్స్‌ప్రెస్ ఛార్జీ ప్రతి 8 నిమిషాలకు ఖమ్మంకు బస్సు.. 99 ట్రిప్పులు: సత్తుపల్లి డిపో మేనేజర్ లక్ష్మి నారాయణ వెల్లడి

సత్తుపల్లి / ఖమ్మం సత్తుపల్లి నుంచి ఖమ్మం ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం డీలక్స్ బస్సుల్లో ఎక్స్‌ప్రెస్ ఛార్జీతో ప్రయాణించే అవకాశం కల్పించినట్లు సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ తెలిపారు. బుధవారం నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. సత్తుపల్లి–ఖమ్మం రూట్‌లో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక బస్సు నడిచేలా ప్రణాళిక రూపొందించామని, మొత్తం 99 ట్రిప్పులు నడుస్తున్నాయని తెలిపారు. ఇప్పటివరకు డీలక్స్ ఛార్జీ రూ.130 ఉండగా, ఇకపై రూ.120గా నిర్ణయించినట్లు వివరించారు. ఈ రూట్‌లో 10 డీలక్స్ బస్సులు నడుస్తున్నాయని చెప్పారు. సత్తుపల్లి–విజయవాడకు ప్రతి 20 నిమిషాలకు సర్వీస్ ఏర్పాటు చేశామన్నారు. అశ్వారావుపేటకు అదనంగా ఆరు ట్రిప్పులు, ఏలూరుకు రెండు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సత్తుపల్లి–అంకంపాలెం రూట్‌లో సాయంత్రం 6 గంటలకు అదనపు ట్రిప్పు, భద్రాచలానికి నూతన పల్లెవెలుగు సర్వీస్, కొత్తగూడెంకు నూతన సర్వీస్ ప్రారంభించినట్లు చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ జి. రజిత పాల్గొన్నారు.

సత్తుపల్లి / ఖమ్మం

సత్తుపల్లి నుంచి ఖమ్మం ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం డీలక్స్ బస్సుల్లో ఎక్స్‌ప్రెస్ ఛార్జీతో ప్రయాణించే అవకాశం కల్పించినట్లు సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ తెలిపారు. బుధవారం నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. సత్తుపల్లి–ఖమ్మం రూట్‌లో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక బస్సు నడిచేలా ప్రణాళిక రూపొందించామని, మొత్తం 99 ట్రిప్పులు నడుస్తున్నాయని తెలిపారు. ఇప్పటివరకు డీలక్స్ ఛార్జీ రూ.130 ఉండగా, ఇకపై రూ.120గా నిర్ణయించినట్లు వివరించారు. ఈ రూట్‌లో 10 డీలక్స్ బస్సులు నడుస్తున్నాయని చెప్పారు. సత్తుపల్లి–విజయవాడకు ప్రతి 20 నిమిషాలకు సర్వీస్ ఏర్పాటు చేశామన్నారు. అశ్వారావుపేటకు అదనంగా ఆరు ట్రిప్పులు, ఏలూరుకు రెండు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సత్తుపల్లి–అంకంపాలెం రూట్‌లో సాయంత్రం 6 గంటలకు అదనపు ట్రిప్పు, భద్రాచలానికి నూతన పల్లెవెలుగు సర్వీస్, కొత్తగూడెంకు నూతన సర్వీస్ ప్రారంభించినట్లు చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ జి. రజిత పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.