ఖమ్మం జులై
(పున్నమి న్యూస్)
సంత్ గురు రవిదాస్ ఆశయాల సాధనే బీజేపీ లక్ష్యమని ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బండ్ల రీగన్ ప్రతాప్ అన్నారు. రవిదాస్ జయంతి సందర్భంగా జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రవిదాస్ బోధనలు సమానత్వం, కులరహిత సమాజ నిర్మాణానికి మార్గదర్శకమని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం అట్టడుగు వర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. సమాజంలో వివక్ష, మూఢనమ్మకాల నిర్మూలనకు రవిదాస్ చేసిన కృషి స్ఫూర్తిదాయకమని రీగన్ ప్రతాప్ పేర్కొంటూ, ఆయన ఆశయాల ప్రచారానికి ఎస్సీ మోర్చా కృషి కొనసాగిస్తుందని తెలిపారు.



