ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతి సత్యనారాయణ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ పువ్వాళ్ళ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, సీనియర్ నాయకులు పులిపాటి వెంకయ్య, జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు కొత్తా సీతారాములు, సేవాదళ్ అధ్యక్షులు సయ్యద్ గౌస్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్ తదితర స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించారు. దేశ స్వాతంత్ర్యంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, యువతకు ఉపాధి, పేదల అభ్యున్నతికి పార్టీ కట్టుబడి ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రజాపాలన అందిస్తున్నారని తెలిపారు.
కార్యక్రమంలో తాళ్లూరి హనుమంతరావు, శెట్టి రంగారావు, కామా అశోక్, పట్టాభి, కిలారు అనిల్‌కుమార్, కొట్టే రాజశేఖర్, దేవత్ శంకర్ నాయక్, యాసబోయిన శ్రీశైలం, గాదె ఝాన్సీ, వినోద, కమర్తపు మురళి, ముక్తార్ జోహారా, పాలకుర్తి నాగేశ్వరరావు, గజ్జి సూర్యనారాయణ, శ్రీనివాస్ యాదవ్, గడ్డం వెంకటయ్య, బీరెడ్డి రమేష్, జహీర్, ఇసాక్, పాకాలపాటి శేషగిరిరావు, ఫరీద్ ఖాద్రి, బడేమియా, నారాయణ, ఉపేందర్, లక్ష్మీబాయి, జొన్నలగడ్డ అరుణ, దమయంతి, కాసిని శ్రీనివాస్, పంది రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



