సంగం గ్రామ పంచాయతీ పరిధిలో పలు ప్రాంతాలలో గడిచిన మూడు రోజుల నుంచి నీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు ముఖ్యంగా సాయి నగర్ ప్రాంతంలో నీరు రాక మహిళల మధ్య నీటి కోసం పోట్లాడుకునే పరిస్థితి నెలకొంది. గతంలో బండారుమిట్ట బాయి దగ్గర ఉన్న పంచాయితీ మోటారు ను గతంలో ఉన్న పంచాయతీకి సంబంధించిన పాలకులు తొలగించడం జరిగింది . దీనిపై అనేక పర్యాయాలు ఇక్కడ ప్రజలు గత పాలకులకు మరియు అధికారులకు ఇక్కడ ఉండే ( బండారు మిట్ట వద్ద ఉన్న పంచాయతీ నీటి పాయింటు మోటారును ) నీటి పాయింటును పునరుద్ధరించమని తెలియజేయడం జరిగింది. అయినను గతంలో ఉన్న పంచాయతీ పాలకుల దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. పంచాయతీల కాల పరిమితి పూర్తయ్యేసరికి గతంలో పరిపాలించిన వాళ్ళ కాలం తీరిపోయిందని, స్పెషల్ ఆఫీసర్ల పాలనలో నీటి సమస్యలు తీరుతాయని ఇక్కడ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు అయినను ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి తో పాటు గతంలో పరిపాలించిన పాలకుల ప్రమేయంతో ఏమైనా ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయా అని ఈ ప్రాంత ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రత్యేక అధికారులు చొరవ చూపి గత పాలకులతో పని లేకుండా పంచాయతీకి సంబంధించిన త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థలు, శానిటేషన్ లపై ప్రత్యేక శ్రద్ధ చూపి ప్రజల అవసరాల నిమిత్తం ప్రత్యేక అధికారులు పనిచేయాలని సవినయంగా పంచాయతీ ప్రత్యేక అధికారులకు విన్నవించుకుంటున్నారు.

సంగం గ్రామపంచాయతీ పరిధిలో నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగం గ్రామ ప్రజలు.