*వైయస్సార్ సిపి మాజీ ఎంపీటీసీ ఎంఎన్ఆర్ సతీమణి…*
*శ్రీమతి ముడమాల రుక్మిణమ్మ (58) మృతికి రెడ్యం సోదరుల సంతాపం.*
*వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చి ధైర్యం చెప్పిన రెడ్యం సోదరులు.*
*మైదుకూరు మండలం, నంద్యాలం పేట పంచాయితీ, వరదాయపల్లెకు చెందిన వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీటీసీ ఎంఎన్ఆర్ సతీమణి, వైయస్సార్ సిపి యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముడమాల నరసింహారెడ్డి తల్లి, శ్రీమతి ముడమాల రుక్మిణమ్మ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు.*
*వైయస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, వైయస్సార్ సిపి నేత, కేసీ కెనాల్ ప్రాజెక్ట్ మాజీ వైస్ చైర్మన్ రెడ్యం చంద్రశేఖర్ రెడ్డిలు సోమవారం ఉదయం వరదాయపల్లెలోని వారి స్వగృహంలో రుక్మిణమ్మ మృతదేహంపై పూలమాలవేసి నివాళులు అర్పించి, ప్రగాడ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తపరిచారు. రుక్మిణమ్మ భర్త మా కుటుంబ మిత్రులు యం ఎన్ ఆర్ ను, కుమారుడు ముడమాల నరసింహారెడ్డిని పరామర్శించి, ఓదార్చి, ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ధైర్యాన్ని, మనోనిబ్బరాన్ని ఇవ్వాలని ప్రార్థించినట్లు రెడ్యం తెలిపారు.*



