Thursday, 16 July 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో వీధి కుక్కల కట్టడి, ప్లాస్టిక్ దుకాణాలపై దాడులు
- తిరుపతి

శ్రీకాళహస్తిలో వీధి కుక్కల కట్టడి, ప్లాస్టిక్ దుకాణాలపై దాడులు

శ్రీ కాళహస్తి, జులై 15, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని పలు ప్రాంతాలలో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న వీధి కుక్కలను అదుపు చేసేందుకు మునిసిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎం.ఎం. వాడ, ఆర్‌టీసీ బస్టాండ్, శ్రీరామ్‌నగర్ కాలనీ పరిసరాల్లో సంచరిస్తున్న కుక్కలను తిరుపతికి చెందిన అనిమల్ బర్త్ కంట్రోల్ (ABC) బృందం సహకారంతో పట్టుకున్నారు. జంతు సంక్షేమ నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియను పూర్తి చేశారు. మరోవైపు పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఆర్‌టీసీ బస్టాండ్, కే.ఎస్. టిప్ప సమీపంలోని వాణిజ్య సముదాయాలలో నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై సానిటరీ సిబ్బంది ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించి ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు విక్రయిస్తున్న, వాడుతున్న దుకాణదారులను గుర్తించి సరుకును సీజ్ చేయడంతో పాటు వారికి భారీగా జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా మునిసిపల్ కమీషనర్ కె.వి. కృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. వ్యాపారులు పర్యావరణానికి ముప్పుగా మారిన ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా స్వస్తి చెప్పాలని, ప్రత్యామ్నాయంగా జనపనార, గుడ్డ సంచులను ప్రోత్సహించాలని సూచించారు. ఈ ప్లాస్టిక్ నియంత్రణ, కుక్కల నివారణ కార్యక్రమాలలో మునిసిపల్ డిప్యూటీ ఇంజనీర్, సానిటరీ ఇన్స్పెక్టర్, సానిటరీ సెక్రటరీలు, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.