Tuesday, 16 June 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
- తిరుపతి

శ్రీకాళహస్తిలో జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు

శ్రీ కాళహస్తి, జూన్ 15, (పున్నమి న్యూస్) : అన్నమయ్య నగర్‌లో చిత్తూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. శ్రీకాళహస్తి మునిపెన్నడూ లేని విధంగా సీనియర్ స్త్రీ, పురుషుల జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ లాయర్ వెంకటస్వామి, సెక్రటరీ పసుపులేటి బాలాజీ సంయుక్త ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. ఐదు రోజుల పాటు సాగే ఈ జాతీయ పోటీల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి స్త్రీ, పురుషుల జట్లతో పాటు ఇండియన్ రైల్వేస్ జట్లు కూడా పాల్గొంటాయి. మొత్తం 750 మంది క్రీడాకారులు, 250 మంది అధికారులు కలిపి సుమారు 1,000 మంది ఈ ఛాంపియన్‌షిప్‌నకు హాజరవుతారు. గతంలో ఈ విషయమై శ్రీకాళహస్తి ఎమ్మెల్యేను కలవగా సానుకూలంగా స్పందించారని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో సంప్రదించిన అనంతరం త్వరలోనే పోటీల తేదీలను ప్రకటిస్తామని వివరించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.