Monday, 20 April 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో అట్టహాసంగా సి.యం. 76వ జన్మదిన వేడుకలు
- తిరుపతి

శ్రీకాళహస్తిలో అట్టహాసంగా సి.యం. 76వ జన్మదిన వేడుకలు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 20 (పున్నమి న్యూస్( శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో బొజ్జల బృందమ్మ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నాడు హైదరాబాద్‌ను, నేడు నవ్యాంధ్ర, అమరావతిని ప్రపంచ స్థాయి నగరాలుగా తీర్చిదిద్దడంలో చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అపర చాణక్యుడిగా గుర్తింపు పొందిన ఆయన విజన్ రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచి అని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుండి స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డితో చంద్రబాబుకు ఉన్న అనుబంధం మరువలేనిదని ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. నాడు చంద్రబాబు క్యాబినెట్‌లో అత్యంత ఆప్తమిత్రుడిగా బాధ్యతలు నిర్వర్తించి, నియోజకవర్గ అభివృద్ధికి గోపాలకృష్ణ రెడ్డి ఎంతో కృషి చేశారని తెలిపారు. అదే స్ఫూర్తితో నేడు చంద్రబాబు నాయకత్వంలో శ్రీకాళహస్తిని ప్రగతి పథంలో నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.జన్మదినం సందర్భంగా చంద్రబాబు చిత్రపటానికి అభిమానులు, నాయకులు పాలభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రికి భగవంతుడు నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.