శ్రీ కాళహస్తి, ఆగస్టు 11, (పున్నమి న్యూస్): గర్భధారణ సమయంలో, అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులను ఆసుపత్రికి చేర్చడం నుంచి ప్రసవం అనంతరం తల్లి, బిడ్డలను క్షేమంగా ఇంటికి చేర్చే వరకు ఉచిత రవాణా సేవలు అందించేందుకు ప్రభుత్వం తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సహకారంతో శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి రెండు కొత్త వాహనాలు మంజూరయ్యాయి. ఈ వాహనాలను ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు గరికపాటి రమేష్ బాబు పరిశీలించారు. 102 అంబులెన్స్ డ్రైవర్లు పోలయ్య, రవి ఎల్లవేళలా అత్యవసర సేవలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రమేష్ బాబు, ఉచితంగా లభించే ఈ సేవల కోసం ప్రజలు 102 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ అంబులెన్సులు పూర్తి సెన్సార్ పరిజ్ఞానంతో పనిచేస్తాయని తెలిపారు. ప్రయాణంలో ఏమైనా సమస్యలు ఎదురైతే వాహనంలో ఉన్న బటన్ నొక్కిన వెంటనే విజయవాడలోని ప్రధాన కార్యాలయానికి సమాచారం వెళ్లి, అక్కడ నుంచి డ్రైవర్‌ను సంప్రదించి సమస్యను పరిష్కరిస్తారని వివరించారు. వాహనంలో తల్లి, బిడ్డతో పాటు ఇద్దరు కుటుంబ సభ్యులు ప్రయాణించే వెసులుబాటు ఉందన్నారు. ఈ సేవలు రాష్ట్రంలోని వేలాది నిరుపేద కుటుంబాలకు ఎంతో భరోసానిస్తాయని, నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి రెండు ‘తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను పరిశీలించిన గరికపాటి రమేష్