శ్రీ హనుమాన్ దేవాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన (భూమి పూజ) మహోత్సవం
పున్నమి న్యూస్ ప్రతినిధి
19 ఏప్రిల్ 2026
తెలంగాణ ఇంచార్జ్
రంగారెడ్డి జిల్లా
రేపు 20.04.2026 సోమవారం
అత్యంత వైభవంగా నిర్వహించబడుతోంది
ఈ పవిత్ర కార్యక్రమం బ్రహ్మశ్రీ ప్రవీణ్ కుమార్ శర్మ పౌరోహిత్యంలో శాస్త్రోక్త మార్గదర్శకత్వంలోనిర్వహించబడుతుంది. ఈ శుభ సందర్భంలో గ్రామ భక్తులందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి, పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము.
కార్యక్రమ వివరాలు
ముహూర్తం: ఉదయం 7:30 గంటలకు
వేదిక: నక్కర్త హనుమాన్ దేవాలయ ప్రాంగణం
పూజా కార్యక్రమం అనంతరం
భక్తులందరికీ తీర్థ ప్రసాద వితరణ జరుగును
మన గ్రామ దేవాలయ పునర్నిర్మాణ మహత్కార్యంలో మనమందరం భాగస్వాములై స్వామి వారి కృపకు పాత్రులమవుదాం
ఇట్లు
హనుమాన్ దేవాలయ కమిటీ&గ్రామ పెద్దలు






