వైభవంగా శ్రీ శనీశ్వర స్వామి, శ్రీ అభయ హస్తా ఆంజనేయ స్వామి వారి ప్రాకారోత్సవం
పున్నమి ప్రతినిధి ప్రతినిధి రామచంద్రాపురం
రామచంద్రాపురం మండలం రాయల చెరువు పంచాయతీ చాయా పురంలో వెలిసి ఉన్న శ్రీ శనీశ్వర స్వామి ఆలయ ఆవరణంలో శ్రీ మహా మండలేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా మంగళవారం ఉదయం మహాగణపతి హోమం, గోపూజతో 40 మంది శ్రీ చండీ ఉపాసకులచే శ్రీ శత చండీ పారాయణ సహిత చండీ మహా యజ్ఞము అంకురార్పణ జరిగింది. అనంతరం క్షేత్ర మూల దైవం శ్రీ శనీశ్వర స్వామివారికి, క్షేత్ర పాలకులు శ్రీ అభయస్థ ఆంజనేయ స్వామి వారికి ప్రాకారోత్సవాన్ని ఆలయ ధర్మాధికారి ఉంగరాల సుబ్రహ్మణ్యం శర్మ భక్తులతో కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీరామ జపం ఆంజనేయ స్వామి జపంతో భక్తిశ్రద్ధలతో ప్రాకారోత్సవంలో పాల్గొన్నారు. ఉభయ దాతలకు అర్చకులు శని దోష నివారణ హోమం, నవగ్రహ దోష నివారణ, గణపతి హోమాలు జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మాధికారి మాట్లాడుతూ మూడు రోజులపాటు శ్రీ శతచండీ పారాయణ సహిత చండీ మహా యజ్ఞం సంకల్పించడానికి కారణం లోక కళ్యాణార్థం, ప్రజల కుటుంబాల సౌఖ్యం, సమృద్ధి సుఖం సకల జీవుల సౌలభ్యం కొరకు చేస్తున్న మహా యజ్ఞం అని తెలిపారు. ఆలయ చిత్ర దైవమైన శ్రీ శనీశ్వర స్వామి వారికి తైలాభిషేకం, నవగ్రహ పూజలు, నవగ్రహ నివారణ హోమాలు చేయడం వల్ల ప్రతి ఒక్కరికి శాంతి, సుఖం, మంచి జీవితం ప్రాప్తిస్తుందని తెలిపారు. ఈ మూడు రోజులు మహా శివ క్షేత్రాల నుంచి వచ్చిన 40 మంది చండీ ఉపాసకులచే శత చండి పారాయణ సహిత మహాయుగంలో భక్తులందరూ పాల్గొని పూర్వజన్మ పాపాలను, దోషాల నుంచి విముక్తి పొందాలని తెలిపారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తులను అలరించాయి. అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. మహా యాగానికి విచ్చేసిన భక్తులందరికీ ఆలయ నిర్వాహకులు అన్నదాన వితరణ చేశారు.


