Friday, 18 September 2026
  • Home  
  • శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ తృతీయ వార్షికోత్సవం ప్రారంభోత్సవానికి డా. పసుపులేటి శంకర్
- అన్నమయ్య

శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ తృతీయ వార్షికోత్సవం ప్రారంభోత్సవానికి డా. పసుపులేటి శంకర్

వల్లూరు: వల్లూరు మండలం బీచువారిపల్లిలోని శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ తృతీయ వార్షికోత్సవ కార్యక్రమం 20/09/2026న ఉదయం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మైదుకూరు స్పెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ డాక్టర్ పసుపులేటి శంకర్‌ను ట్రస్ట్ నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వల్లూరు సబ్‌ఇన్‌స్పెక్టర్ సూర్యనారాయణరెడ్డి, విశ్వహిందూ పరిషత్ కడప జిల్లా అధ్యక్షులు నందారపు చెన్నకృష్ణారెడ్డి, అఖిల భారత ప్రచార సమితి కడప జిల్లా అధ్యక్షులు దేవతి శంకరయ్య, కడప శ్రీహరి డిగ్రీ కళాశాల అధ్యక్షులు గుత్తిరెడ్డి సుబ్బారెడ్డి, మైదుకూరు సాహిత్య డిగ్రీ కళాశాల అధ్యక్షులు సంజీవరెడ్డి, పోలతల శివాలయం చైర్మన్ సిరిరెడ్డి రాజారెడ్డి, వల్లూరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్ ప్రణీత్ రెడ్డి, కడప షుగర్ డాక్టర్ శివారెడ్డి, కడప రైన్ షైన్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ శివకృష్ణ, వల్లూరు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ గంగిరెడ్డి అంకిరెడ్డి పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం గణపతి పూజ నిర్వహించడంతో పాటు, సమావేశం అనంతరం భోజన ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు కూన ఈశ్వరరెడ్డి, పోలు ఓబుళరెడ్డి, ఓబులేసు, సందడి అమరనాథ్‌రెడ్డి, తవ్వా మధుసూదన్‌రెడ్డి, పి.వి. కృష్ణారెడ్డి, శ్రీనివాసులు, రాఘవరెడ్డి తెలిపారు.

వల్లూరు: వల్లూరు మండలం బీచువారిపల్లిలోని శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ తృతీయ వార్షికోత్సవ కార్యక్రమం 20/09/2026న ఉదయం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మైదుకూరు స్పెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ డాక్టర్ పసుపులేటి శంకర్‌ను ట్రస్ట్ నిర్వాహకులు ఆహ్వానించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వల్లూరు సబ్‌ఇన్‌స్పెక్టర్ సూర్యనారాయణరెడ్డి, విశ్వహిందూ పరిషత్ కడప జిల్లా అధ్యక్షులు నందారపు చెన్నకృష్ణారెడ్డి, అఖిల భారత ప్రచార సమితి కడప జిల్లా అధ్యక్షులు దేవతి శంకరయ్య, కడప శ్రీహరి డిగ్రీ కళాశాల అధ్యక్షులు గుత్తిరెడ్డి సుబ్బారెడ్డి, మైదుకూరు సాహిత్య డిగ్రీ కళాశాల అధ్యక్షులు సంజీవరెడ్డి, పోలతల శివాలయం చైర్మన్ సిరిరెడ్డి రాజారెడ్డి, వల్లూరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్ ప్రణీత్ రెడ్డి, కడప షుగర్ డాక్టర్ శివారెడ్డి, కడప రైన్ షైన్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ శివకృష్ణ, వల్లూరు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ గంగిరెడ్డి అంకిరెడ్డి పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా ఉదయం గణపతి పూజ నిర్వహించడంతో పాటు, సమావేశం అనంతరం భోజన ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు కూన ఈశ్వరరెడ్డి, పోలు ఓబుళరెడ్డి, ఓబులేసు, సందడి అమరనాథ్‌రెడ్డి, తవ్వా మధుసూదన్‌రెడ్డి, పి.వి. కృష్ణారెడ్డి, శ్రీనివాసులు, రాఘవరెడ్డి తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.