*తేదీ:-18.05.2026* పున్నమి ప్రతినిధి
ఆసిఫాబాద్ నియోజకవర్గం
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖిరిడి గ్రామంలో శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన *ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి* గారు మరియు బిఆర్ఎస్ (BRS) నాయకురాలు మర్సకోల సరస్వతి గారు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో మాలి సంక్షేమ సంఘం గ్రామ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


