Wednesday, 22 April 2026
  • Home  
  • శ్రీ చెల్లేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ఆదిశంకరాచార్య జయంతి
- తిరుపతి

శ్రీ చెల్లేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ఆదిశంకరాచార్య జయంతి

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 21 (పున్నమి న్యూస్( శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్ ప్రాంతంలో వెలసిన శ్రీ చెల్లేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ఆదిశంకరాచార్యుల విగ్రహానికి అర్చకులు విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, స్వామివారికి పాలు, పెరుగు, గంధం, తేనె, విభూది, కొబ్బరి నీళ్లు తదితర సుగంధ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారిని అందంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ పూజా కార్యక్రమాలు లయ అర్చకుడు దర్భా సాయి చంద్ ఆధ్వర్యంలో నిర్వహించబడగా, అర్చకులు దర్భా తులసిరాం, గోవిందు, సురేష్, కుమార్ వేద మంత్రోచ్ఛారణల మధ్య ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆదిశంకరాచార్యుల ఆశీస్సులు పొందారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.