మహానంది : శ్రావణ శుక్రవారం సందర్భంగా మహానంది క్షేత్రంలో శ్రీ కామేశ్వరీ అమ్మవారు, మహానందీశ్వర స్వామివార్ల పల్లకి సేవను శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి అనంతరం పల్లకి సేవ చేపట్టారు.స్వామివార్లను పల్లకిలో ఆలయ ప్రాంగణంలో ఊరేగించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు. పల్లకి సేవ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తుల సందడితో కళకళలాడాయి. స్వామివారి దర్శనం అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అధికారులు, సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.

శ్రావణ శుక్రవారం సందర్భంగా కామేశ్వరీ మహానందీశ్వర స్వామివార్ల పల్లకి సేవ ఘనంగా