శాతువారిపల్లి గ్రామంలో వీధి లైట్ల సమస్యకు పరిష్కారం లభించింది. స్థానిక యువత సమస్యను జనసేన నాయకుల దృష్టికి తీసుకెళ్లగా, వారు ₹30 వేల ఆర్థిక సాయం అందించారు. ఆ నిధులతో కొనుగోలు చేసిన LED వీధి లైట్లను ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ చేతుల మీదుగా మండల నాయకులకు అందజేశారు. అనంతరం విద్యుత్ స్తంభాలకు లైట్లు అమర్చడంతో గ్రామ వీధులు వెలుగులతో కళకళలాడాయి. సహకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్‌కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో రోడ్డు సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు.

శాతువారిపల్లిలో జనసేన సాయంతో LED వెలుగులు