ఉదయగిరి SMGR ప్రభుత్వ వ్యవసాయ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి వ్యవసాయ ప్రవేశ పరీక్షలో ప్రతిభ చాటారు. కళాశాల నుంచి పరీక్షకు హాజరైన 149 మంది విద్యార్థుల్లో 53 మంది ఉత్తీర్ణత సాధించారు. మొక్కల విజ్ఞానశాస్త్ర విభాగంలో నాగేళ్ల హేమంత్కుమారరెడ్డి జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించి సత్తా చాటారు. కీటకశాస్త్ర విభాగంలో తెల్లజాల మణి వెంకటకుమార్ 36వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ టి.గోపికృష్ణ అభినందించారు. విద్యార్థుల కృషి, అధ్యాపకుల మార్గదర్శకత్వం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. కళాశాలకు విద్యార్థులు మంచి పేరు తీసుకురావడం అభినందనీయమన్నారు.

వ్యవసాయ ప్రవేశ పరీక్షలో ఉదయగిరి విద్యార్థుల సత్తా