వరికుంటపాడు: మండలంలోని రామాపురంలో నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమానికి ప్రజలు, కార్యకర్తలను తరలించేందుకు పలు గ్రామాల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సభకు కార్యకర్తలతో వెళ్తున్న ఓ బస్సును ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జడదేవి వద్ద ఆపారు. బస్సులోని కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించి, కాసేపు వారితో ముచ్చటించారు. కార్యక్రమం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యకర్తలతో సరదాగా మాట్లాడి విజయ సంకేతం చూపించారు. ఎమ్మెల్యే తమను పలకరించడంతో కార్యకర్తలు ఉత్సాహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బస్సులో సందడి వాతావరణం నెలకొంది. అనంతరం ఎమ్మెల్యే అక్కడి నుంచి సభా ప్రాంగణం వైపు బయలుదేరారు.

బస్సులో సందడి చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్