Saturday, 3 October 2026
  • Home  
  • వ్యవసాయ కూలీలపై తేనెటీగల దాడి
- వరంగల్

వ్యవసాయ కూలీలపై తేనెటీగల దాడి

నలుగురు కూలీలకు అస్వస్థత చెరువు కొమ్ము తండాలో చోటుచేసుకున్న సంఘటన వ్యవసాయ కూలీలపై తేనెటీగలు దాడి చేసిన సంఘటన మండలంలోని చెరువుకొమ్ము తండాలో శుక్రవారం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ము తండా గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు భూక్య శాంతమ్మ, రమ, గుగులోతు రజిత, లలితలు శుక్రవారం ఉదయం పత్తి ఏరడానికి వెళుతుండగా తేనెటీగలు వారిపై ఒకసారిగా దాడి చేశాయి. దీంతో వారు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది పైలట్ వైనాల నాగరాజు, ఈఎంటీ ప్రవీణ్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని బాధితులకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బాధితులను నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించినట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.