Tuesday, 8 September 2026
  • Home  
  • వైసీపీ ఆరోపణలు అసంబద్ధం-మెగా డీఎస్సీ భర్తీ పారదర్శకం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
- తిరుపతి

వైసీపీ ఆరోపణలు అసంబద్ధం-మెగా డీఎస్సీ భర్తీ పారదర్శకం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 08, (పున్నమి న్యూస్): కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ద్వారా 16,400 ఉపాధ్యాయ పోస్టులను అత్యంత పారదర్శకంగా, కేవలం ప్రతిభ ఆధారంగానే భర్తీ చేసిందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ.. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియపై వైసీపీ నేతలు చేస్తున్న అక్రమాల ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఖండించారు. తమ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయని జగన్ రెడ్డికి, డీఎస్సీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. ప్రభుత్వం కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల ప్రతిభను గుర్తించిందని, వైసీపీ అభిమానుల కుటుంబాలకు కూడా మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో మళ్ళీ డిసెంబర్‌లో మరో డీఎస్సీ, వచ్చే ఏడాది ఇంకో డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని చెప్పారు. ఒకవైపు సంక్షేమం, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతుండటంతో పాటు మరోవైపు వెలిగొండ, పోలవరం వంటి సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతుండటాన్ని చూసి ఓర్వలేకే వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.