Tuesday, 29 September 2026
  • Home  
  • వైరా ఎగ్జిట్ వద్ద బస్సు–లారీ ఢీ క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌కు స్వల్ప గాయాలు
- ఖమ్మం

వైరా ఎగ్జిట్ వద్ద బస్సు–లారీ ఢీ క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌కు స్వల్ప గాయాలు

ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై వైరా ఎగ్జిట్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దేవరపల్లి నుంచి ఖమ్మం వైపు వస్తున్న ప్రైవేట్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. వెంటనే స్పందించిన ప్రయాణికులు, ఇతర వాహనదారులు శ్రమించి డ్రైవర్‌ను క్యాబిన్ నుంచి బయటకు తీశారు. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు పలువురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో హైవేపై కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.