పున్నమి న్యూస్ ప్రతినిధి (జూలై 13)వేముల మండలం
వేముల గ్రామ సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు వేముల గ్రామసమాఖ్య-5 ఎగ్జిక్యూటివ్ కమిటీ (EC) సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో వెలుగు డి ఆర్ డి ఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆంజనేయులు , పాల్గొని పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు.
సమావేశంలో 2026–27 బ్యాంకు లింకేజీ కార్యాచరణ ప్రణాళిక అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రతి గ్రామ సంఘంలో 20 జీవనోపాధి, ఔత్సాహిక వ్యాపారాల ప్రోత్సాహం అందించాలని కమ్యూనిటీ కో ఆర్డినేటర్ జ్యోతికి సూచించారు , మహిళల సామర్థ్యాభివృద్ధి శిక్షణలు ఇవ్వాలని,అన్ని రకాల రుణాలు మరియు వడ్డీ రేట్లపై అవగాహన కల్పించారు.ఫార్మర్ ప్రొడ్యూసర్ గ్రూప్ ఏర్పాటు చేయాలనీ గ్రామ సమాఖ్య అసిస్టెంట్ పవన్ ను ఆదేశించారు. జెండర్ రిసోర్స్ సెంటర్ ఏర్పాటు , CRPs/GPs పాత్రలు, FNHW ఉపకమిటీల బాధ్యతలు వివరించారు. సభ్యులకు PMJJBY, PMSBY బీమా పథకాలు, కొత్త జీవనోపాధి అవకాశాలు, కిచెన్ గార్డెన్లు, బ్యాక్యార్డ్ పౌల్ట్రీ, డెయిరీ మరియు అనుబంధ జీవనోపాధి యూనిట్లు,ఏర్పాటు చేయాలన్నారు.PMEGP & PMFME సబ్సిడీ పథకాల ద్వారా మహిళలు పారిశ్రామిక వేత్తలు గా ఎదగాలని తెలిపారు , సంఘం స్థాయిలో 100% డిజిటల్ చెల్లింపుల అంశాలపై విస్తృతంగా చర్చించి కార్యాచరణ రూపొందించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు, డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహం మరియు రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతానికి కార్యవర్గం చురుకుగా పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీసీ జ్యోతి, గ్రామసమాఖ్య అధ్యక్షులు, కార్యదర్శి, గ్రామసమాఖ్య అసిస్టెంట్ పవన్ డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు






