వేంసూరు / ఖమ్మం
వేంసూర్: వర్షాభావ పరిస్థితులతో బోర్లు ఎండిపోయి ఇబ్బందులు పడుతున్న వేంసూర్ మండల రైతులకు ఊరట కల్పించేలా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్యలు చేపట్టారు. గోదావరి జలాలను బేతుపల్లి చెరువుకు పంపించి, అక్కడి నుంచి ఎన్టీఆర్ కెనాల్ ద్వారా వేంసూర్ మండలానికి సాగునీరు అందించేలా తక్షణ ఏర్పాట్లు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు. రైతుల పంటలను కాపాడేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. సాగునీటి సరఫరాలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.



