Sunday, 6 September 2026
  • Home  
  • వెంగమాంబ పేరంటాలు అమ్మవారి దర్శన వేళల్లో మార్పు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వెంగమాంబ పేరంటాలు అమ్మవారి దర్శన వేళల్లో మార్పు

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నఱ్ఱవాడ గ్రామంలోని శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి దేవస్థానం పునర్నిర్మాణం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గణాచారుల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7న సోమవారం ఉదయం 9:10 గంటల నుంచి 10:30 గంటలలోపు అమ్మవారికి సెలవ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించనున్నారు. అనంతరం సెప్టెంబర్ 8న మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి బాలాలయంలో అమ్మవారి పునర్దర్శనం ప్రారంభమవుతుంది. భక్తులు ఈ మార్పును గమనించి సహకరించాలని దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు, కార్యనిర్వహణాధికారి కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.