Monday, 13 July 2026
  • Home  
  • వృద్ధ కళాకారులకు నెలకు రూ.8 వేల పెన్షన్ ఇవ్వాలి
- News - ఆంధ్రప్రదేశ్ - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వృద్ధ కళాకారులకు నెలకు రూ.8 వేల పెన్షన్ ఇవ్వాలి

గుర్తింపు కార్డులు జారీ చేయాలని ప్రజానాట్యమండలి వినతి ఆత్మకూరు, జూలై 13 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): వృద్ధ కళాకారులకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్‌ను నెలకు రూ.8,000కు పెంచి, వారికి గౌరవప్రదమైన జీవనం కల్పించాలని ప్రజానాట్యమండలి ఆత్మకూరు ఏరియా కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అలాగే రాష్ట్రంలోని అర్హులైన కళాకారులందరికీ గుర్తింపు కార్డులు జారీ చేసి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం ఆత్మకూరులోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆర్డీఓ కార్యాలయ పరిపాలనా అధికారికి (ఏవో) వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సాంప్రదాయ, పౌరాణిక, సాంఘిక నాటకాలు, వీధి నాటికలు, జానపద కళారూపాలు, వాయిద్య కళలు, ఆట, పాట, మాట, నటన వంటి అనేక కళారూపాల ద్వారా కళాకారులు దశాబ్దాలుగా సమాజానికి విశిష్ట సేవలు అందిస్తున్నారని తెలిపారు. సామాజిక చైతన్యం పెంపొందించడంలో, మూఢనమ్మకాల నిర్మూలనలో, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో కళాకారుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.ప్రస్తుతం 60 సంవత్సరాలు దాటిన వృద్ధ కళాకారులు కళలపై ఆధారపడి జీవనం సాగించడం కష్టతరంగా మారిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం అందిస్తున్న ప్రస్తుత పెన్షన్ జీవన అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదని, దీంతో అనేక మంది కళాకారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వృద్ధ కళాకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నెలకు రూ.8,000 పెన్షన్ మంజూరు చేయడంతో పాటు అర్హులైన ప్రతి కళాకారునికి గుర్తింపు కార్డులు జారీ చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి ఆత్మకూరు ఏరియా కమిటీ అధ్యక్షుడు సయ్యద్ షుకూర్, కార్యదర్శి గద్దర్ బాబు, కమిటీ సభ్యులు పాల్గొని ఆర్డీఓ కార్యాలయ అధికారికి వినతిపత్రాన్ని అందజేశారు.

గుర్తింపు కార్డులు జారీ చేయాలని ప్రజానాట్యమండలి వినతి

ఆత్మకూరు, జూలై 13 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):

వృద్ధ కళాకారులకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్‌ను నెలకు రూ.8,000కు పెంచి, వారికి గౌరవప్రదమైన జీవనం కల్పించాలని ప్రజానాట్యమండలి ఆత్మకూరు ఏరియా కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అలాగే రాష్ట్రంలోని అర్హులైన కళాకారులందరికీ గుర్తింపు కార్డులు జారీ చేసి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం ఆత్మకూరులోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆర్డీఓ కార్యాలయ పరిపాలనా అధికారికి (ఏవో) వినతిపత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సాంప్రదాయ, పౌరాణిక, సాంఘిక నాటకాలు, వీధి నాటికలు, జానపద కళారూపాలు, వాయిద్య కళలు, ఆట, పాట, మాట, నటన వంటి అనేక కళారూపాల ద్వారా కళాకారులు దశాబ్దాలుగా సమాజానికి విశిష్ట సేవలు అందిస్తున్నారని తెలిపారు. సామాజిక చైతన్యం పెంపొందించడంలో, మూఢనమ్మకాల నిర్మూలనలో, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో కళాకారుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.ప్రస్తుతం 60 సంవత్సరాలు దాటిన వృద్ధ కళాకారులు కళలపై ఆధారపడి జీవనం సాగించడం కష్టతరంగా మారిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం అందిస్తున్న ప్రస్తుత పెన్షన్ జీవన అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదని, దీంతో అనేక మంది కళాకారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వృద్ధ కళాకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నెలకు రూ.8,000 పెన్షన్ మంజూరు చేయడంతో పాటు అర్హులైన ప్రతి కళాకారునికి గుర్తింపు కార్డులు జారీ చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి ఆత్మకూరు ఏరియా కమిటీ అధ్యక్షుడు సయ్యద్ షుకూర్, కార్యదర్శి గద్దర్ బాబు, కమిటీ సభ్యులు పాల్గొని ఆర్డీఓ కార్యాలయ అధికారికి వినతిపత్రాన్ని అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.