కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 14:
వినాయక చతుర్థి వేడుకల్లో భాగంగా జగ్గంపేటలో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ దర్శించుకున్నారు.జేవియర్ అపార్ట్మెంట్, పద్మనాభ నగర్, సత్తి సదాశివరెడ్డి విగ్రహం, చెరువుగట్టు, శెట్టిబలిజిపేట, మర్రిమొక్క వీధి, రత్నాలపేట, గొల్లపేట, మార్కెట్ వీధి, మెయిన్ రోడ్డు, జయ హాస్పిటల్, అంబేద్కర్ కాలనీ, టాక్సీ స్టాండ్, మినీ గూడ్స్ వ్యాన్ స్టాండ్, జ్యోతుల కాలనీ, శ్రీరామ్ నగర్, నిలకుండీలపేట తదితర ప్రాంతాల్లోని అన్ని మండపాలను తిరిగి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడి ఆశీస్సులతో జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరి విఘ్నాలు తొలగిపోవాలని ఆకాంక్షించారు. సూపర్ ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, వినాయకుడి కృపతో మంచి వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో, ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, పాండ్రంగి రాంబాబు, పాలచర్ల నాగేంద్ర చౌదరి, సత్తి సదాశివరెడ్డి, ఎస్.ఏ.గఫూర్, పీలా మహేష్, నండ్ల చిరంజీవి, మారిశెట్టి గంగ, నేదురి గణేష్, సాంబత్తుల చంద్రశేఖర్, రిస్ రమణ, కూప్పా తాతారావు, ముక్కా పాలబాబు, పలివెల యేసురాజు, కోడూరి రమేష్, బండారు నాని, హరి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

వినాయక మండపాల్లో భక్తులతో మమేకమైన జ్యోతుల నెహ్రూ
కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 14: వినాయక చతుర్థి వేడుకల్లో భాగంగా జగ్గంపేటలో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ దర్శించుకున్నారు.జేవియర్ అపార్ట్మెంట్, పద్మనాభ నగర్, సత్తి సదాశివరెడ్డి విగ్రహం, చెరువుగట్టు, శెట్టిబలిజిపేట, మర్రిమొక్క వీధి, రత్నాలపేట, గొల్లపేట, మార్కెట్ వీధి, మెయిన్ రోడ్డు, జయ హాస్పిటల్, అంబేద్కర్ కాలనీ, టాక్సీ స్టాండ్, మినీ గూడ్స్ వ్యాన్ స్టాండ్, జ్యోతుల కాలనీ, శ్రీరామ్ నగర్, నిలకుండీలపేట తదితర ప్రాంతాల్లోని అన్ని మండపాలను తిరిగి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడి ఆశీస్సులతో జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరి విఘ్నాలు తొలగిపోవాలని ఆకాంక్షించారు. సూపర్ ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, వినాయకుడి కృపతో మంచి వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో, ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, పాండ్రంగి రాంబాబు, పాలచర్ల నాగేంద్ర చౌదరి, సత్తి సదాశివరెడ్డి, ఎస్.ఏ.గఫూర్, పీలా మహేష్, నండ్ల చిరంజీవి, మారిశెట్టి గంగ, నేదురి గణేష్, సాంబత్తుల చంద్రశేఖర్, రిస్ రమణ, కూప్పా తాతారావు, ముక్కా పాలబాబు, పలివెల యేసురాజు, కోడూరి రమేష్, బండారు నాని, హరి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

