Monday, 14 September 2026
  • Home  
  • వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పల్లా భాస్కర్ రెడ్డిని సన్మానించిన చత్రపతి శివాజీ యూత్
- రంగారెడ్డి

వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పల్లా భాస్కర్ రెడ్డిని సన్మానించిన చత్రపతి శివాజీ యూత్

పున్నమి: నాగర్ కర్నూల్ జిల్లా: కోడేరు మండలం, నాగులపల్లి: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నాగులపల్లి గ్రామంలో చత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహా గణనాథునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి గ్రామ ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. వినాయక విగ్రహదాతగా, అలాగే అన్నదాన కార్యక్రమానికి సహకరించిన పల్లా భాస్కర్ రెడ్డి గారికి వినాయక బృందం సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆయన అందించిన సహకారాన్ని అభినందిస్తూ పుష్పగుచ్ఛం అందజేసి చిరు సత్కారం చేశారు. ఈ సందర్భంగా చత్రపతి శివాజీ యూత్ సభ్యులు మాట్లాడుతూ, పండుగల నిర్వహణకు దాతలు అందిస్తున్న సహకారం ఎంతో అభినందనీయమని తెలిపారు. భక్తి, సేవా కార్యక్రమాలతో వినాయక చవితిని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చత్రపతి శివాజీ యూత్ సభ్యులు, వినాయక బృందం సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగులపల్లి గ్రామ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. 🙏🏻💐

పున్నమి: నాగర్ కర్నూల్ జిల్లా: కోడేరు మండలం, నాగులపల్లి: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నాగులపల్లి గ్రామంలో చత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహా గణనాథునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి గ్రామ ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.

వినాయక విగ్రహదాతగా, అలాగే అన్నదాన కార్యక్రమానికి సహకరించిన పల్లా భాస్కర్ రెడ్డి గారికి వినాయక బృందం సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆయన అందించిన సహకారాన్ని అభినందిస్తూ పుష్పగుచ్ఛం అందజేసి చిరు సత్కారం చేశారు.

ఈ సందర్భంగా చత్రపతి శివాజీ యూత్ సభ్యులు మాట్లాడుతూ, పండుగల నిర్వహణకు దాతలు అందిస్తున్న సహకారం ఎంతో అభినందనీయమని తెలిపారు. భక్తి, సేవా కార్యక్రమాలతో వినాయక చవితిని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో చత్రపతి శివాజీ యూత్ సభ్యులు, వినాయక బృందం సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగులపల్లి గ్రామ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. 🙏🏻💐

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.