Wednesday, 15 July 2026
  • Home  
  • విద్యార్థుల సంక్షేమ పథకాల కోసం ఆధార్ అప్‌డేట్ తప్పనిసరి.. ఏటికొప్పాకలో ప్రత్యేక నమోదు శిబిరాలు
- అనకాపల్లి

విద్యార్థుల సంక్షేమ పథకాల కోసం ఆధార్ అప్‌డేట్ తప్పనిసరి.. ఏటికొప్పాకలో ప్రత్యేక నమోదు శిబిరాలు

అనకాపల్లి జిల్లా, జూలై 15 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): మేజర్ పంచాయతీ అయిన ఏటికొప్పాక గ్రామంలో విద్యార్థులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ‘అమ్మ ఒడి’ వంటి పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హ విద్యార్థికి అందేలా జిల్లా కలెక్టర్ ఆదేశాలు, మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) సూచనల మేరకు ఆధార్ అప్‌డేట్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఏటికొప్పాకలోని అక్షరా స్కూల్లో విద్యార్థుల ఆధార్ వివరాల సవరణ, నమోదు కార్యక్రమం నిర్వహించారు. రేపు జడ్పీహెచ్ హైస్కూల్లో ఈ కార్యక్రమం కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల ఆధార్ కార్డులతో పాఠశాలకు వచ్చి ఆధార్ వివరాలు తప్పనిసరిగా అప్‌డేట్ చేయించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఎంఈఓ ఆదేశాల మేరకు ఏటికొప్పాక గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ నూకరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా అక్షరా స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, కిసాన్ మోర్చా అధ్యక్షుడు శెన్నాంశెట్టి శ్రీను, ఎంఫీపీ స్కూల్ మాజీ చైర్మన్ మొల్లేటి ప్రసాద్, గ్రామ పెద్ద శంకర్ రాజు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అధికారులు ప్రతి విద్యార్థి ఆధార్ వివరాలు సకాలంలో నవీకరించుకోవాలని మరోసారి సూచించారు.

అనకాపల్లి జిల్లా, జూలై 15 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):

మేజర్ పంచాయతీ అయిన ఏటికొప్పాక గ్రామంలో విద్యార్థులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ‘అమ్మ ఒడి’ వంటి పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హ విద్యార్థికి అందేలా జిల్లా కలెక్టర్ ఆదేశాలు, మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) సూచనల మేరకు ఆధార్ అప్‌డేట్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఏటికొప్పాకలోని అక్షరా స్కూల్లో విద్యార్థుల ఆధార్ వివరాల సవరణ, నమోదు కార్యక్రమం నిర్వహించారు. రేపు జడ్పీహెచ్ హైస్కూల్లో ఈ కార్యక్రమం కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల ఆధార్ కార్డులతో పాఠశాలకు వచ్చి ఆధార్ వివరాలు తప్పనిసరిగా అప్‌డేట్ చేయించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఎంఈఓ ఆదేశాల మేరకు ఏటికొప్పాక గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ నూకరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది.
ఈ సందర్భంగా అక్షరా స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, కిసాన్ మోర్చా అధ్యక్షుడు శెన్నాంశెట్టి శ్రీను, ఎంఫీపీ స్కూల్ మాజీ చైర్మన్ మొల్లేటి ప్రసాద్, గ్రామ పెద్ద శంకర్ రాజు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అధికారులు ప్రతి విద్యార్థి ఆధార్ వివరాలు సకాలంలో నవీకరించుకోవాలని మరోసారి సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.