విజయవాడ, జూలై 18 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి విచ్చేసిన మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, SIR నేషనల్ కన్వీనర్ శ్రీ తరుణ్ చుగ్ గారికి SIR స్టేట్ కన్వీనర్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం పలువురు బీజేపీ నాయకులతో కలిసి తరుణ్ చుగ్ గారిని ఆత్మీయంగా ఆహ్వానించి, రాష్ట్రంలోని పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత బలోపేతం తదితర అంశాలపై స్వల్పంగా చర్చించినట్లు సమాచారం.



