రాజన్న సిరిసిల్ల జులై 18 (పున్నమి ప్రతినిధి)
యువతకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?” – కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ ‘యువ సంగ్రామ సదస్సు’కు ముస్తాబాద్ యువత భారీ తరలింపు
హామీలు నెరవేర్చని ప్రభుత్వాన్ని యువత ప్రశ్నించే సమయం ఆసన్నమైంది.”
యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను, నిరుద్యోగులను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విస్మరించిందని ఆరోపిస్తూ, ప్రభుత్వం తన హామీలను గుర్తు చేసుకొని యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సరూర్‌నగర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సంగ్రామ సదస్సుకు ముస్తాబాద్ మండలం నుంచి బీఆర్ఎస్ యువ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు.
ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖ్య అతిథిగా హాజరుకానుండగా, ముస్తాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి, యూత్ సీనియర్ నాయకుడు రాచమడుగు సంతోష్ రావు, యూత్ రాష్ట్ర నాయకులు మెంగని మనోహర్, విద్యార్థి వింగ్ మండల అధ్యక్షుడు యండి. నవాజ్, నరేష్, పల్లె ఆనంద్, శ్రీనివాస్, వంగురి దిలీప్, వెంకటేష్, రాజు, మనీష్ తదితరులు పాల్గొన్నారు.


