నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దు..
రంగారెడ్డి జిల్లా: విజయ ఆయిల్‌ను తెలంగాణకే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా విస్తరించి, జాతీయ స్థాయి బ్రాండ్‌గా తీర్చిదిద్దాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
శివరాంపల్లిలో టీజీ ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయ మెగా ఆయిల్ ప్యాకింగ్ కేంద్రం, మినరల్ వాటర్ ప్లాంట్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కలిసి ప్రారంభించారు. విజయ వంట నూనెల విక్రయ కేంద్రానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ విజయ బ్రాండ్‌పై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాలని, నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని సూచించారు. విజయ ఆయిల్ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చేలా తయారీ, పంపిణీ, విక్రయ వ్యవస్థను బలోపేతం చేయాలని అన్నారు.
తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగును 10 లక్షల ఎకరాలకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించేలా మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.
కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, వ్యవసాయ శాఖ అధికారులు, ఆయిల్‌ఫెడ్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.



