ఉదయగిరిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాధారణ రైతు కుటుంబం నుంచి ఎదిగి రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్న దూరదృష్టి గల నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ వంటి ప్రాజెక్టులతో రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నారని అన్నారు. కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు.



