ఏర్పేడు, మే 02 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి తన మానవత్వంతో మరోసారి ప్రశంసలు అందుకున్నారు. శుక్రవారం ఏర్పేడు మండలం మేర్లపాక ఎస్టీ కాలనీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు, ఒక వికలాంగురాలు తన బాధను వెల్లడించింది. తనకు ఎవరూ లేరని, పింఛన్ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆమె వేడుకుంది. ఆమె దయనీయ పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వెంటనే స్పందించి, తన సొంత నిధుల నుంచి రూ. 4 వేల తక్షణ సాయం అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్‌తో ఫోన్‌లో మాట్లాడి, వచ్చే నెల నుంచే ఆమెకు పింఛన్ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే చూపిన చొరవ, మానవత్వంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఆయన సేవా భావం ప్రజల మనసులను గెలుచుకుంటోందని కొనియాడారు.

వికలాంగురాలికి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అండ… తక్షణ సాయం, పింఛన్‌కు హామీ