Monday, 11 May 2026
  • Home  
  • వరికుంటపాడులో శాంతి భద్రతల బలోపేతానికి కృషి చేయాలి : ఎమ్మెల్యే కాకర్ల సురేష్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వరికుంటపాడులో శాంతి భద్రతల బలోపేతానికి కృషి చేయాలి : ఎమ్మెల్యే కాకర్ల సురేష్

వరికుంటపాడు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన మధుసూదన్ రావు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా పనిచేస్తూ ప్రజల సమస్యలకు వెంటనే స్పందించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీస్ శాఖ సిబ్బందితో సమన్వయంతో పని చేస్తూ వరికుంటపాడు మండలంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. నూతన బాధ్యతల్లో ఎస్సై మధుసూదన్ రావుకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.