వరదయ్యపాలెం: దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వరదయ్యపాలెం లో రాజీవ్ గాంధీ విగ్రహం ఘనంగా జరిగాయి.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీ రమణయ్య ప్రజా ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కుమార్, ఆధ్వర్యంలో ప్రజా యూనియన్ నాయకులతో కలిసి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా దేశభక్తి గీతాలతో కార్యక్రమ స్థలం మారుమోగింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా యూనియన్ నాయకులు పాల్గొని స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని, రాజ్యాంగ విలువలను నిలబెట్టాలని ఈ సందర్భంగా రమణయ్య గారు పిలుపునిచ్చారు.
చివరగా అమరవీరులకు నివాళులు అర్పించి, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో,ప్రజా ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కుమార్, బి సుబ్రహ్మణ్యం, v వెంకటయ్య, ఎం మహబూబ్, b సుబ్రహ్మణ్యం, వి రమణయ్య,, పంచర్ షాప్ అశోక్, ద్వారా వెంకటేశ్వర్లు, దాము, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
జై హింద్ | జై భారత్


