*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి*.
కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ రోజు కింగ్ జార్జ్ హాస్పిటల్ లో వందే మాతరం పాట వ్రాసి 150 సంవత్సరములు అయిన సందర్భంగా mass sing కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఐ. వాణి మాట్లాడుతూ వందేమాతరం పాట యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. ప్రతి భారతీయుడు భారతమాతని గౌరవించాలని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ లు డా. రాధాకృష్ణన్, డా.ఎం.చంద్రశేఖరం నాయుడు, అడ్మినిస్ట్రేటర్ బి. వి.రమణ, ఏ.ఆర్. ఎం.ఓ.లు డా.ఏ.రాజేష్, డా. ఎస్.చంద్రబాబు నాయుడు, నర్సింగ్ స్టాఫ్ స్టూడెంట్స్ మినిస్టరియల్ స్టాఫ్ పాల్గొనడం జరిగింది.


