Tuesday, 29 September 2026
  • Home  
  • లోకేశ్వరం–హద్గం రోడ్డా.. నరకానికి నకలా! హామీలు గాలిలో.. గుంతల రహదారిపై ప్రజల అవస్థలు.
- నిర్మల్

లోకేశ్వరం–హద్గం రోడ్డా.. నరకానికి నకలా! హామీలు గాలిలో.. గుంతల రహదారిపై ప్రజల అవస్థలు.

### **లోకేశ్వరం–హద్గం రోడ్డా.. నరకానికి నకలా!** #### **హామీలు గాలిలో.. గుంతల రహదారిపై ప్రజల అవస్థలు** లోకేశ్వరం: మండలంలోని లోకేశ్వరం–హద్గం రహదారి అధ్వానంగా మారి ప్రయాణికులకు నరకప్రాయంగా మారింది. రహదారిపై అడుగడుగునా భారీ గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు కురిసిన సమయంలో గుంతల్లో నీరు చేరడంతో రహదారి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రహదారి నిర్మాణం చేపడతామని హామీలు ఇచ్చారని, అయితే రెండేళ్లు గడిచినా రహదారి పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. రోడ్డు మంజూరైందంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కాకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.నాయకుల వెంట తిరిగే కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఒక్కసారి ఈ రహదారిపై ప్రయాణించి వాస్తవ పరిస్థితిని పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే రహదారిని పరిశీలించి, మరమ్మతులు చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని హామీలను అమలు చేసి, లోకేశ్వరం–హద్గం రహదారి అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.

### **లోకేశ్వరం–హద్గం రోడ్డా.. నరకానికి నకలా!**

#### **హామీలు గాలిలో.. గుంతల రహదారిపై ప్రజల అవస్థలు**

లోకేశ్వరం: మండలంలోని లోకేశ్వరం–హద్గం రహదారి అధ్వానంగా మారి ప్రయాణికులకు నరకప్రాయంగా మారింది. రహదారిపై అడుగడుగునా భారీ గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు కురిసిన సమయంలో గుంతల్లో నీరు చేరడంతో రహదారి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రహదారి నిర్మాణం చేపడతామని హామీలు ఇచ్చారని, అయితే రెండేళ్లు గడిచినా రహదారి పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. రోడ్డు మంజూరైందంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కాకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.నాయకుల వెంట తిరిగే కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఒక్కసారి ఈ రహదారిపై ప్రయాణించి వాస్తవ పరిస్థితిని పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే రహదారిని పరిశీలించి, మరమ్మతులు చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని హామీలను అమలు చేసి, లోకేశ్వరం–హద్గం రహదారి అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.