వార్త ముఖ్యాంశాలు
- బీజేపీ జిల్లా లేబర్ సెల్ మీటింగ్లో జిల్లా లేబర్ సెల్ ఉపాధ్యక్షుడు సబ్బని రాజేష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో లేబర్ కార్డు అప్లికేషన్ ను నెగ్లెక్ట్ చేయకండి.
- భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డుతో ఎన్నో లాభాలున్నాయి.
- ప్రమాదవషత్తు మరణిస్తే నామినికి ₹10 లక్షలు.
బీజేపీ జిల్లా లేబర్ సెల్ మీటింగ్లో జిల్లా లేబర్ సెల్ ఉపాధ్యక్షుడు సబ్బని రాజేష్ కుమార్ మాట్లాడుతూ
తెలంగాణలో లేబర్ కార్డు అప్లికేషన్ ను నెగ్లెక్ట్ చేయకండి. భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డుతో ఎన్నో లాభాలున్నాయి. ప్రమాదవషత్తు మరణిస్తే నామినికి ₹10 లక్షలు. సహజ మరణానికి ₹ 2లక్షలు.శాశ్వత వైకల్యానికి ₹ 4 లక్షలు ఇస్తారు.
ఏడాది తర్వాత ప్రసూతి, కుమార్తె పెళ్ళికి ₹ 30 వేలు. 5 రోజులకు మించి ఆసుపత్రిలో చేరితే నెలకు ₹ 4500 చొప్పున 3 నెలలు, ఏటా ఉచిత వైద్య పరీక్షలు, పిల్లలుకు చదువు, స్టైఫెండ్ లభిస్తాయి.
మీసేవ లేదా లేబర్ ఆఫీస్ లో అప్లై చేసుకోవచ్చు.
ఈ మీటింగ్ లో జిల్లా లేబర్ సెల్ అధ్యక్షుడు గుమలాపురం సత్యనారాయణ, జిల్లా విద్యార్థి సంగం అధ్యక్షుడు ఆర్యా, మనస్విని శ్రీనివాస్ ఇంకా తదితరులు పాల్గొన్నారు.