నంద్యాల-జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పీసీపీఎన్డీటీ డీఎల్ఎస్సీ కమిటీ సమావేశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శారదాబాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్సులు రద్దు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఆడబిడ్డలను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. స్కానింగ్ కేంద్రాల్లో ధరల పట్టికలను తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు.సమావేశంలో కమిటీ సభ్యులు డాక్టర్ రవీంద్రనాథ్‌రెడ్డి, డాక్టర్ శ్రవణ్‌కుమార్, జిల్లా విస్తరణ, మాస్ మీడియా అధికారి మల్లేపల్లి పామన్న, డాక్టర్ సలీమున్నీసా బేగం, బర్డ్ ఎన్జీవో ప్రతినిధులు వినయ్‌బాబు, వంశీ పాల్గొన్నారు.

లింగ నిర్ధారణ చేస్తే జైలుకే
నంద్యాల-జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పీసీపీఎన్డీటీ డీఎల్ఎస్సీ కమిటీ సమావేశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శారదాబాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్సులు రద్దు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఆడబిడ్డలను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. స్కానింగ్ కేంద్రాల్లో ధరల పట్టికలను తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు.సమావేశంలో కమిటీ సభ్యులు డాక్టర్ రవీంద్రనాథ్‌రెడ్డి, డాక్టర్ శ్రవణ్‌కుమార్, జిల్లా విస్తరణ, మాస్ మీడియా అధికారి మల్లేపల్లి పామన్న, డాక్టర్ సలీమున్నీసా బేగం, బర్డ్ ఎన్జీవో ప్రతినిధులు వినయ్‌బాబు, వంశీ పాల్గొన్నారు.

