ఖమ్మం, జూలై
(పున్నమి న్యూస్):
ఖమ్మం నగరంలోని లాకారం ట్యాంక్‌బండ్ పార్క్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ హోంగార్డ్ మద్యం మత్తులో హల్చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రెండు రోజుల క్రితం ముత్యాలమ్మ గుడి సమీపంలో తన స్నేహితులతో కలిసి వచ్చిన సదరు హోంగార్డ్ మద్యం సేవించి డ్యాన్స్ చేసినట్లు స్థానికులు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు స్థానికులు 100 నంబర్‌కు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ చేపట్టగా, ఘటన జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు సమాచారం. దీంతో సంబంధిత హోంగార్డ్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హోంగార్డ్ ఆర్ఐ సురేష్ పున్నమి న్యూస్‌కు తెలిపారు.



